సీఎం జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.
ఇంకా 46 రోజులే ఉంది.. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ అందరిదీ అంటూ చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమకు మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు.