Homeఆంధ్రప్రదేశ్మోదీకి అండగా ఉండాలన్న సీఎం జగన్

మోదీకి అండగా ఉండాలన్న సీఎం జగన్

ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం జగన్ స్పందించారు.

కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అందరమూ అండగా నిలబడదామని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇంతటి క్లిష్ట సమయంలో కేంద్రానికి శతధా సహకరించాలని, వేలెత్తిచూపడం ఏమాత్రం భావ్యం కాదని ట్విట్టర్ వేదికగా జగన్ హితవు పలికారు.

ఇలాంటి సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు.

అయితే సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని జగన్ ట్వీట్ చేశారు.

హేమంత్‌కు ఫోన్ చేసిన మోదీ

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.

వీరితో పాటు జార్ఖండ్ సీఎం సోరెన్‌కు కూడా ఫోన్ చేసి, మాట్లాడారు.

ఈ విషయాన్ని విమర్శిస్తూ సీఎం సోరెన్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని మోదీ ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటను మాత్రమే చెప్పారు. కట్టడికి ఏం చేయాలో సూచనలు ఇస్తే బాగుండేది. మా మాట వింటే మరింత బాగుండేది’’ అంటూ సోరెన్ ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img