Jagan : వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ (Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుందని ఆయన అన్నారు. జగనన్న 1.0లో ప్రజల కోసం ఆలోచించా.. కానీ జగనన్న 2.లో మాత్రం కార్యకర్తల కోసమే ఆలోచిస్తాను అని కచ్చితంగా చెప్తున్న అని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను కానీ చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను, కష్టాలను చూస్తున్నా అని అన్నారు. ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడం తప్ప.. ఏం పీకలేదు అని జగన్ విరుచుకుపడ్డారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను అని అన్నారు. ఎక్కడున్నా వారిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా.. మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నాం అని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నిజస్వరూపం జనాలకు పూర్తిగా అర్ధం అవుతుంది కాబట్టి, ఈసారి జనం మనల్ని 30 ఏళ్ళు కూర్చోబెడతారు అని వైఎస్ జగన్ అన్నారు. 16 నెలలు నన్ను జైల్లో వేశారు.. బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాను అని జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు దొంగ కేసులు పెడుతరు, బెదిరిస్తారు లేదంటే, మూడు నెలలు జైల్లో వేస్తారు. ఆ తరువాత మళ్లీ బయటకు వచ్చి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం అని వైఎస్ జగన్ తెలిపారు.