ఏపీ సీఎం చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశారని రాజకీయాల్లో చర్చ సాగుతోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణతో పదవికి రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులో మోపిదేవి కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన ద్వారా జగన్ బెయిల్ రద్దు చేయించి విచారణ వేగంగా జరిగితే జగన్ ను జైలుకు పంపడం సులువు అవుతుందని భావిస్తున్నారట.