మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బొత్స ద్వారా విశాఖ జిల్లాను హస్తగతం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ స్కెచ్ వేస్తున్నారట. ఇందులో భాగంగానే విశాఖపట్నం, విజయనగరం బాధ్యతలను బొత్సకు అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న విశాఖలో పాగా వెయ్యాలంటే అది బొత్స వల్లే సాధ్యమని జగన్ భావిస్తున్నారట.