Homeహైదరాబాద్latest Newsజగన్ బతుకే ఒక ఫేక్ బతుకు: CBN

జగన్ బతుకే ఒక ఫేక్ బతుకు: CBN

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. పింఛన్లను టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘‘వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఎలోనే ఉంది. పెన్షన్‌లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదు అని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదు. పెన్షన్‌ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్దులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదు. ప్రజలారా కుట్రలను చేదించండి….దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి. అధికారం లోకి రాగానే పెన్షన్ రూ.4000 కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం’’ అని ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img