జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురంలో రాజకీయం మరో మలుపు తిరిగింది. పవన్ కల్యాణ్ పేరుతో మూడు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్లు వేసిన వారి పేర్లు, వారు ఎంచుకున్న గుర్తులు ఆధారంగా ఓ మోడల్ బ్యాలెట్ పేపర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జనసైనికుల్లో టెన్షన్ నెలకొంది. కొందరు ఇదంతా జగన్ మాస్టర్ ప్లాన్ అని, మరి కొందరు పవన్ గెలుస్తాడని భయంతో జగన్ ఇలా చేయిస్తున్నాడని అభిప్రాయ పడుతున్నారు.