ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని వైఎస్ జగన్ నేడు ఢిల్లీలో జంతర్‌మంతర్‌లో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జగన్‌కు మద్దతుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. శివసేన(యూబీటీ), తృణమూల్ కాంగ్రెస్, ఐయూఎంఎల్, ఎఐఎడిఎంకే ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ అనుకున్న వ్యూహం ఫలించదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా కూటమితో కలిసి రావాలని జగన్‌ను వారు ఆహ్వానించాయి. దీనిపై జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.