కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు అనే ఎపిసోడ్ ముగిసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన విషయాలన్నిటినీ పక్కకు పెట్టి కేవలం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, కేసీఆర్ తనకు రూ.15 కోట్లు ఇచ్చారన్న వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
“ఒకసారి గెలవచ్చు. ఒకసారి ఓడిపోవచ్చు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. అధికారం లేకపోయినా నేను బలవంతుడినే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలకు గుణపాఠం వచ్చింది. వాళ్లను ప్రత్యేకంగా శిక్షించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా 5 ఏళ్లు పూర్తిగా అధికారంలో ఉంటుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఫెయిల్ అవుతాయి. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రయత్నిస్తూనే ఉంటా”.
– జగ్గారెడ్డి