Homeతెలంగాణమేఘా కృష్ణారెడ్డి ఆస్తుల‌పై జ‌గ్గారెడ్డి ఫైర్‌

మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల‌పై జ‌గ్గారెడ్డి ఫైర్‌

Megha Krishnareddy, who drives a Maruti car on her own, has earned thousands of crores of rupees in these six years? The head of Rs 30,000 crore has been officially announced.

How is this possible? Megha Krishnareddy’s assets of Rs 30,000 crore out of Rs 3 lakh crore in debt incurred by Telangana government Congress MLA Jaggareddy asked.

‘‘మారుతి కారులో సొంతగా డ్రైవింగ్‌ చేసుకుంటూ తిరిగే మేఘా కృష్ణారెడ్డి ఈ ఆరేళ్లలో రూ.వేల కోట్లు ఎట్లా సంపాదించాడు?  రూ.30 వేల కోట్లకు అధిపతినని అధికారికంగా ప్రకటించారు. ఇది ఎట్లా సాధ్యం?  తెలంగాణ సర్కార్‌ చేసిన మూడు లక్షల కోట్ల అప్పుల్లోనివే మేఘా కృష్ణారెడ్డి 30 వేల కోట్ల ఆస్తులు కావా? ’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఆయన అవినీతి గురించి పార్లమెంటులో మాట్లాడాలని కోరుతూ మంగళవారం పార్టీ ఎంపీలను కలిశారు. మేఘా కృష్ణారెడ్డిపై, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్‌ భగీరథలో చేసిన అక్రమాలపై విచారణకు డిమాండ్‌ చేయాలని సూచించారు.

పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, ఎజెండాపై ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలు సమావేశమయ్యారు.

వారిని కలిసిన అనంతరం జగ్గారెడ్డి నోట్‌ విడుదల చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి రూ. రెండు లక్షల కోట్ల విలువైన పనులను మేఘా కృష్ణారెడ్డికి ఏకపక్షంగా ఇచ్చిన విషయం నిజం కాదా ? అని ప్రశ్నించారు.

తెలంగాణ డబ్బులతో ఆర్థికంగా బాగా ఎదిగి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కృష్ణారెడ్డిని  టార్గెట్‌ చేయకపోతే కాంగ్రెస్​కు పెద్ద ప్రమాదమని, ఆయన టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. మేఘా అవినీతి చాలా ఉందనీ, త్వరలో మరిన్ని విషయాలు బయటపెడతానని జగ్గారెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img