Homeహైదరాబాద్latest Newsజగిత్యాల జిల్లాలో మరోసారి గంజాయి కలకలం.. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్

జగిత్యాల జిల్లాలో మరోసారి గంజాయి కలకలం.. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడానికి తీసికెళ్తున్న ఇద్దర్ని రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్, తన బృందం తో కలిసి ఈ రోజు గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్న కోరుట్లకు చెందిన మానాల అక్షిత్, మల్లాపూర్ మండలం వేంపల్లికి చెందిన మెండే నివేద్లను శనివారం అరెస్టు చేసినట్లు జగిత్యాల రూరల్ సీఐ ఆరీఫ్ అలీ ఖాన్ తెలిపారు. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. గతంలో 6 కిలోల గంజాయితో పట్టుబడి జైలుకు వెళ్లిన నలుగురు వ్యక్తుల నుంచి వీరు గంజాయి కొనుగోలు చేసి విక్రయించేవారన్నారు.

Recent

- Advertisment -spot_img