ఇదేనిజం, రాయికల్: రాయికల్ పట్టణ గుడేటి రెడ్డి సంఘం లో రాయికల్ పట్టణ, మండలానికి చెందిన 66 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు అయిన 66 లక్షల రూపాయల విలువగల చెక్కులను,116 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 23 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఎమ్మార్వో ఖయ్యూం, ఎంపిడిఓ, ఇంచార్జి కమిషనర్ చిరంజీవి,కౌన్సిలర్ అనూ రాధ, కో ఆప్షన్ సభ్యులు సోహెల్, మహేంద్ర బాబు, నాయకులు కోల శ్రీనివాస్ షైక్ హుస్సేన్, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.