Homeహైదరాబాద్దేశవ్యాప్త జైల్భరో పిలుపులో భాగంగా రాస్తారో

దేశవ్యాప్త జైల్భరో పిలుపులో భాగంగా రాస్తారో

ఈసీఐఎల్​, ఇదే నిజం : కరోనా ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ నిరసనగా దేశవ్యాప్త జైల్భరో కార్యక్రమానికి ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా సీఐటీయూ, ఎస్​ఎఫ్​ఐ, ఎన్​పీఆర్​డీ, ఐద్వా, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, టీకేజీకేఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మీ, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జై చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫ్రంట్ వారియర్స్​కి రక్షణ కల్పించడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తీవ్రంగా విమర్శించడం జరిగింది. కొన్ని దేశాలలో ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వాలే స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచితంగా వైద్యాన్నిఅందజేస్తుందని అనేక దేశాలు కరోనా కట్టడి చేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకొని కట్టడి చేయడం జరిగిందని, కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో విఫలమైందని మరో పక్క కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు కట్టబెట్టడానికి అదేవిధంగా సహజ వనరులైన బొగ్గు ఆయిల్ నిక్షేపాలను కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని కార్మిక చట్టాలను పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చి వేస్తుందని దీనిని ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img