హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీపై చిక్కడపల్లి PSలో కేసు నమోదైన విషయం తెలిసిందే. BNS చట్టంలోని సెక్షన్ 105, 118(1) వంటి నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.