- ‘జైలర్’ నటుడు దుర్మరణం
‘Jailor’ actor ఇదేనిజం, నేషనల్ బ్యూరో: కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖనటుడు, దర్శకుడు జీ మారి ముత్తు (57) గుండెపోటుతో మరణించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు మారి ముత్తు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మారి ముత్తు కొంతకాలం దర్శకుడు కావాలనే కోరికతో గీత రచయిత వైరముత్తు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్‌లో సహాయ దర్శకునిగా చేరాడు. మణిరత్నం, వసంత్, ఎస్ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు. ‘మన్మధన్’సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘కన్నుమ్ కన్నుమ్’సినిమాతో డైరెక్టర్‌గా మారాడు.