Homeఫ్లాష్ ఫ్లాష్James Anderson: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్..

James Anderson: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్..

ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల వయసులో యువ బౌలర్లతో పోటీపడుతున్న అండర్సన్.. వచ్చే వేసవిలో వెస్టిండీస్‌తో జరిగే మూడు గేమ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌ నుంచి వైదొలగనున్నట్టు శనివారం ప్రకటించాడు. ఈ మ్యాచ్ జూలై 10న జరగనుంది. అరంగేట్రం చేసిన లార్డ్స్‌ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు. జులైలో వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ తనకు చివరిదని అన్నాడు. తాజాగా భారత పర్యటనలో 700 వికెట్ల మైలురాయిని చేరుకోవడం ద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (700) తీసిన పేస్ బౌలర్‌గా అండర్సన్ రికార్డు సృష్టించాడు. బౌలర్‌గా అండర్సన్ 87 టెస్టుల్లో 700 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. 2003లో లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడిన జేమ్స్ అక్కడ తన చివరి టెస్టు ఆడనున్నాడు.

Recent

- Advertisment -spot_img