ఇదే నిజం, నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను గురువారం జమ్మూకశ్మీర్, లడక్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టస్సిర బస్తాన్ కుటుంబ సమేతంగా సందర్శించారు. బుధవారం రాత్రి నాగార్జునసాగర్ ఎ చేరుకున్న న్యాయమూర్తి దంపతులు గురువారం నాగార్జున కొండ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం వారు బుద్ధవనం చేరుకొని బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహస్తుపంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. వీరికి నాగార్జునకొండ చారిత్రక విషయాలను , బుద్ధవనం ప్రత్యేకతలను స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ వివరించారు. వీరితో పాటు ప్రోటోకాల్ డిప్యూటీ తహసీల్దార్ శరత్ చంద్ర, పెద్దవూర మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ దండ శ్రీనివాస్ రెడ్డి, బుద్ధవనం సూపర్ వైజర్ విష్ణు, నిడమనూరు కోర్టు సిబ్బంది కాలిక్ తదితరులు ఉన్నారు.