జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. ఏప్రిల్ 6న నెల్లిమర్ల, ఏప్రిల్ 7న అనకాపల్లి, ఏప్రిల్ 8న ఎలమంచిలిలో జరగబోయే బహిరంగ సభల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు.