తనకు కాబోయే వరుడెలా ఉండాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చెప్పింది. ‘నా కలలను తనవిగా భావించాలి. నాకు ధైర్యం చెప్పాలి. ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉంచాలి. నా కష్ట సమయాల్లో పక్కనే ఉండి అండగా నిలవాలి’ అంటూ చెప్పుకొచ్చింది. తాను నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహిలో ఓ పాట రిలీజ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రం మే 31 న విడుదల కానుంది.