దీపావళికి ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొందరు దాన్ని రేవ్ పార్టీ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. డ్రగ్స్ లేవని అధికారులు చెప్పారు’ అని పేర్కొన్నారు.