జన్వాడ పార్టీ రేవ్ పార్టీ ఘటన తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలతో పాటు, విజయ్ మద్దూరీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ పాకాలా తెలంగాణ హైకోర్టుకు వెళ్లి రెండు రోజుల పాటు గడువు కావాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించిన మోకిలా పోలీసులు.. ఈ రోజు తమ ఎదుట హజరు కావాలని రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. అయితే.. రాజ్ పాకాల, విజయ్ మజ్దూరీలను అదుపులోకి విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాజ్ పాకాల తన లాయర్ తో కలసి మధ్యాహ్నాం మోకిలా పోలీసుల ఎదుట హజరుకానున్నట్లు తెలుస్తొంది.