నంద్యాల పట్టణంలోని ప్రముఖ పిజ్జా సెంటర్లో కుళ్లిన చికెన్ కలకలం రేపింది. తాజాగా ఓ కస్టమర్ డొమినోస్ పిజ్జా సెంటర్కు వెళ్లి చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ పిజ్జాలో కుళ్లిన చికెన్ ఉపయోగించారని సదరు వ్యక్తి ఆరోపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.