Jathiratnalu 2 : అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ”జాతిరత్నాలు”. ఈ సినిమా 2021లో మార్చి 11న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాని నాగ్ అశ్విన్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ”ఎవడె సుబ్రమణ్యం” సినిమా విడుదలై 10 ఏళ్ళు కావడంతో ఈ సినిమాని రి-రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ ”జాతిరత్నాలు 2” సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అయితే ”కల్కి 2” సినిమా కొంచం ఆలస్యం అవుతుంది అందుకే ఈలోగా ”జాతిరత్నాలు 2” సినిమా నిర్మిస్తామని చెప్పాడు. ప్రస్తుతం అనుదీప్ విశ్వక్ సేన్‌తో కలిసి ”ఫంకీ” అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ”జాతిరత్నాలు 2” సినిమాని చేసి త్వరలోనే విడుదల చేస్తాం అని నాగ్ అశ్విన్ చెప్పాడు. అయితే ”జాతిరత్నాలు 2” సినిమా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఈ వార్త శుభవార్తే అని చెప్పాలి.