Homeసినిమా'Jawan' 50 days complete ‘JAWAN’ 50 డేస్ కంప్లీట్

‘Jawan’ 50 days complete ‘JAWAN’ 50 డేస్ కంప్లీట్

ఈ ఏడాది జనవరిలో రిలీజైన ‘పఠాన్’సినిమా హిట్​తో వరుస ఫ్లాప్​ల నుంచి బయటపడ్డారు బాలీవుడ్​ స్టార్​ షారుఖ్​ ఖాన్. పఠాన్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మూడేళ్లుగా ఢీలాపడ్డ బాలీవుడ్​ బాక్సాఫీసుకు కొత్త ఊపిరి పోసింది. అయితే, గత నెలలో ‘జవాన్‌’మూవీతో ఆడియెన్స్​ ముందుకు వచ్చారు షారుఖ్​ ఖాన్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 7న ‘జవాన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ-షారుఖ్​ కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో సినిమా సూపర్‌ హిట్‌ టాక్​ను సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలై శుక్రవారానికి 50రోజులు పూర్తి కావడంతో దర్శకుడు అట్లీ స్పెషల్‌ పోస్ట్‌ చేశారు. ‘జవాన్’తో మీ ముందుకు వచ్చి 50 రోజులవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంటోంది. ప్రపంచమంతా దీని హవా కనిపిస్తూనే ఉంది’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. తొలిరోజే రూ.100కోట్లు వసూళ్లు చేసిన జవాన్ ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 50వ రోజు కూడా సుమారు రూ.11లక్షలు వసూళ్లు చేసింది. దీంతో షారుఖ్​ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. విలన్‌గా విజయ్‌ సేతుపతి ఆకట్టుకున్నారు.

Recent

- Advertisment -spot_img