Homeఫ్లాష్ ఫ్లాష్ఏమీరా.. ఇక ఉంటా... నటుడు జయప్రకాష్ కన్నుమూత

ఏమీరా.. ఇక ఉంటా… నటుడు జయప్రకాష్ కన్నుమూత

హైద‌రాబాద్ః సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఇంట్లోని బాత్ రూమ్ లోనే కుప్పకూలినట్టు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్ లు నిర్ధారించారు.
జయప్రకాశ్ రెడ్డి 1946 మే 8 న కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అనంత‌ర కాలంలో ఆయ‌న ఫ్యామిలీ గుంటూరులో సెటిల్ అయ్యారు.
కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో లాక్ డౌన్ మొదలు అయిన‌ప్ప‌టి నుంచి ఆయన తన సొంత ఊరైన‌ గుంటూరులోనే ఉంటున్నారు. అవడానికి గుంటూరు వ్యక్తి అయిన ఆయన రాయలసీమ యాసలోనే ఫేమస్ కావ‌డం విశేషం. నాటక రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన ఆయ‌న‌ సినిమాల్లో ఎన్నో అరుదైన పాత్రలు పోషించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img