Homeహైదరాబాద్latest Newsజేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వారు నియోజకవర్గం అభివృద్ధికి 15 శాతం కమిషన్‌ ఇవ్వాలి.....

జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వారు నియోజకవర్గం అభివృద్ధికి 15 శాతం కమిషన్‌ ఇవ్వాలి.. !

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాట క్లబ్బులు, ఇసుక వ్యాపారులు సంపాదనలో 15 శాతం కమీషన్ ఇవ్వాలని హెచ్చరించారు. వీటన్నింటినీ నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలి. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి 20శాతం నిధులు వెచ్చిస్తానని, ఒక్క రూపాయి కూడా అక్కర్లేదన్నారు. 1952 నుంచి రాజకీయాల్లో ఉన్నామని, ప్రజలు ఆదరిస్తున్నారని.. నియోజకవర్గ అభివృద్ధి అనివార్యమన్నారు. వీరితో పాటు మద్యం దుకాణం నిర్వాహకులు కూడా తనకు 35 శాతం కమీషన్ ఇవ్వాలని హుకుం జారీ చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తాడిపత్రి రాజకీయాలు భిన్నమైనవని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img