Homeహైదరాబాద్latest NewsJEE Main Result 2025: రేపే జేఈఈ మెయిన్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

JEE Main Result 2025: రేపే జేఈఈ మెయిన్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

JEE Main Result 2025: జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజా ప్రకటన ప్రకారం, ఫలితాలు రేపు (ఏప్రిల్ 19, 2025, శనివారం) వెల్లడి కానున్నాయి. ఫైనల్ ఆన్సర్ కీలను ఈ రోజు (ఏప్రిల్ 18, 2025) మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/లో అందుబాటులో ఉంచనున్నారు. అయితే, గతంలో పేపర్-1 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

  • అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ను సందర్శించండి.
  • “JEE Main 2025 Session 2 Result” లింక్‌పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

Recent

- Advertisment -spot_img