Homeజాతీయంయథాతథంగా జేఈఈ, నీట్​ పరీక్షలు

యథాతథంగా జేఈఈ, నీట్​ పరీక్షలు

వాయిదా వేయాలనే పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో జరగనున్న జేఈఈ, నీట్ పరీక్ష లు యథాతథంగా జరగనున్నాయి. కరోనా కారణంగా పరీక్షలను వాయిదా భయ్యా అంటూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ, నీట్ కి ఇవాళ(సోమవారం) న్యాయమూర్తులు పిటిషన్‌ను కొట్టివేశారు. పరీక్షలను వాయిదా వేసిన పక్షంలో విద్యార్థులు నష్టపోతారని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఒక ఏడాదిపాటు అకాడమిక్ ఇయర్ ని స్టూడెంట్స్ కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని పరీక్షలను వాయిదా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఆన్లైన్ మోడ్ లోనే ఎగ్జామ్స్
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ ను, సెప్టెంబర్ 13న నీట్ ను ఆన్లైన్ మోడ్ లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా161 సెంటర్లలో నిర్వహించనున్నరు.
కేసు పూర్వాపరాలు..
కరోనా దృష్ట్యా జేఈఈ, నీట్ వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్ లో కోరారు. అయితే ఇందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ సోమవారం వారి పిటిషన్ ను కొట్టేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనంలోని జడ్జి అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోవిడ్ ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తారని, ఇంకా ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తుపై పరీక్షలు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img