Homeహైదరాబాద్latest Newsఢిల్లీకి బయలుదేరిన జీవన్ రెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయంకు తరలి వెళ్లిన మెట్ పల్లి కాంగ్రెస్ శ్రేణులు

ఢిల్లీకి బయలుదేరిన జీవన్ రెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయంకు తరలి వెళ్లిన మెట్ పల్లి కాంగ్రెస్ శ్రేణులు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ హై కమాండ్ పిలుపు మేరకు బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంబడి మెట్ పల్లి కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయం కు తరలి వెళ్ళారు. గత నాలుగు రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీలో చేర్చుకోవడం పట్ల గత మూడు రోజులుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ విప్ తదితరులు జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి బుజ్జగింపులు సైతం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా సీరియస్ గా తీసుకుని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని సైతం ప్రచారం జరిగింది.

తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి హైదరాబాదుకు వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. సాక్షాత్తు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పిలుపుమేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మెట్ పల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, మెట్ పల్లి జడ్పిటిసి సభ్యులు కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జగిత్యాల జిల్లా కార్యదర్శి శశిధర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సురేందర్ రెడ్డి, కోరుట్ల మండలం పెద్దాపూర్ ఎంపీటీసీ శంకర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img