జార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలు ఇరు కూటమిల మధ్య దోబూచులాడుతున్నాయి. క్షణక్షణానికి మారుతున్న ట్రెండ్స్ అందరినీ ఉత్కంఠ పరుస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో బీజేపీ కూటమి 39 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 41 స్థానాలు కావడంతో టెన్షన్ పెరుగుతోంది.