Homeహైదరాబాద్latest NewsJio మాస్టర్ ప్లాన్.. ఫ్రీగా 50GB క్లౌడ్ డేటా మీ సొంతం..!!

Jio మాస్టర్ ప్లాన్.. ఫ్రీగా 50GB క్లౌడ్ డేటా మీ సొంతం..!!

Jio : రిలయన్స్ జియో (Jio) తన కస్టమర్లకు శుభవార్తను అందించింది. ఇప్పుడు జియో యూజర్లు Gmail లేదా Google Drive లేకుండానే నేరుగా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పొందుతారు. ఈ సౌకర్యం జియో ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అందించబడుతోంది. మీరు జియో యూజర్ అయితే, ఈ ఆఫర్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ బాగా ప్రాచుర్యం పొందింది, కానీ ఇది 15GB వరకు మాత్రమే ఉచిత నిల్వను అందిస్తుంది. జియో మాత్రం 50GB ఉచిత స్టోరేజ్ ను అందిస్తుంది. అది కూడా ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా.. ఫోటోలు, వీడియోలు, పత్రాలు మరియు డిజిటల్ డేటాను సురక్షితంగా నిల్వ చేయవచ్చు. జియో 50GB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా పొందడానికి ₹349, ₹449, ₹649, ₹749 మరియు ₹1,549 ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది.

Recent

- Advertisment -spot_img