ప్రముఖ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఐయాక్టివేట్ (iActivate) పేరుతో కొత్త తరహా సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఇక నుంచి ఇంటి వద్దే సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో ఇప్పటికే సిమ్ కార్డ్‌లను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఐయాక్టివేట్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. అంటే ఇకపై జియో సిమ్ యాక్టివేషన్ కోసం జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు.