Jio Offers : రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్స్
Jio Offers : దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం నూతన సంవత్సరం సందర్భంగా ఆఫర్లను తీసుకొచ్చింది.
ముఖ్యంగా రోజుకు 1.5 జీబీ డేటా, ఇతర సదుపాయాలతో కూడిన 336 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని (గడువును) 29 రోజులు పెంచి 365 రోజులు చేసింది.
కనుక యూజర్లు రూ.2,545 రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కింద.. రోజుకు 1.5జీబీ హై స్పీడ్ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, జియో ప్లాట్ ఫామ్ పై ఇతర సదుపాయాలు (జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్) పొందొచ్చు.
Shopping Tricks : బ్రాండెడ్ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్
Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం
ఈ ప్లాన్ ప్రస్తుత యూజర్లకే కాకుండా, కొత్త యూజర్లకు సైతం లభిస్తుంది.
జనవరి 2 వరకు ఇది అందుబాటులో ఉంటుందని జియో ప్రకటించింది.
జియో ఏడాది వ్యాలిడిటీ తో ఇంకో ప్లాన్ ను కూడా ఆఫర్ చేస్తోంది.
రూ.2,879 రీఛార్జ్ పై 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటాను పొందొచ్చు.
ఇందులోనూ నిత్యం 100 ఎస్ఎంఎస్ లు, ఇతర సదుపాయాలు ఉంటాయి.
20 శాతం జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.719, రూ.666, రూ.299 రీఛార్జ్ ప్లాన్లను సైతం ఆఫర్ చేస్తోంది.
ఈ ప్లాన్లను రీచార్జ్ చేసుకున్న వారు జియోమార్ట్ పై చెల్లింపులకు ఉపయోగపడే క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
Online Transactions : ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ కీలక మార్పులు
Startup Investments : మీ స్టార్టప్‌కు పెట్టుబడి కావాలా.. వీరు పెడతారంటా..