Jio Recharge Plans: భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో, తన వినియోగదారులకు మరోసారి ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. మీరు జియో యూజర్ అయి, లాంగ్ వ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో మంచి ప్రయోజనాలు అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. జియో ఇటీవల 84 రోజులు (దాదాపు 3 నెలలు) వ్యాలిడిటీతో మూడు అద్భుతమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
జియో రూ.799 ప్లాన్
రిలయన్స్ జియో రూ.799 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా, జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంది.
జియో రూ.859 ప్లాన్
జియో రూ.859 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
జియో రూ.889 ప్లాన్
జియో రూ.889 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇందులో జియో హాట్‌స్టార్ మరియు జియో సావన్‌కు ఉచిత యాక్సెస్ కూడా చేర్చబడింది.