ఇదేనిజం, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు మంచి అవకాశం.. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్/సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల సంఖ్య: 484
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-76, భోపాల్-38, ఢిల్లీ-76, కోల్‌కతా-02, లక్నో-78, ఎంఎంజెడ్‌వో-పుణె-118, పాట్నా-96.
అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.14,500 నుంచి రూ.28,145 వరకూ ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
*ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
* దరఖాస్తులకు చివరితేది: 09.01.2024