Homeహైదరాబాద్latest Newsహైడ్రాలో కొలువుల జాతర.. ప్రభుత్వం కీలక నిర్ణయం

హైడ్రాలో కొలువుల జాతర.. ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన పలు భవనాలను కూడా కూల్చివేసింది. కానీ హైడ్రా సంస్థకు చట్టబద్ధత లేదని కొంతమంది రాజకీయ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. హైడ్రాకి అన్ని అధికారాలూ, చట్టబద్ధత కల్పిస్తూ నిన్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు హైడ్రా వ్యవస్థలో మరింత మంది సిబ్బందిని తీసుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చేసింది ప్రభుత్వం. హైడ్రాలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని భావించిన రేవంత్ సర్కార్.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా 169 మంది అధికారులు, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది.

Recent

- Advertisment -spot_img