Homeహైదరాబాద్latest Newsటెన్త్ అర్హతతో పోస్టల్ లో జాబ్స్.. నెలకు రూ.63,000 వరకు జీతం

టెన్త్ అర్హతతో పోస్టల్ లో జాబ్స్.. నెలకు రూ.63,000 వరకు జీతం

నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశం. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఉద్యోగాల భ‌ర్తీకి తపాలా శాఖ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

*ఇందులో ఇండియన్ పోస్ట్ ఉత్తరప్రదేశ్ సర్కిల్‌లో 78 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

*టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు సంబంధిత పత్రాలతో పాటు నింపిన ఫారమ్‌ను మేనేజర్ (GRA), మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్, GPO కాంపౌండ్, కాన్పూర్-208001, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.

వేతనం : నెలకు వేతనం రూ.19,900 – రూ.63,200 ఉంటుంది.

వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ : ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫేజ్-2కి హాజరు కావాలి. ఫేజ్ 2లోని ప్రతి పేపర్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు తుది మెరిట్ జాబితాలో చేర్చబడతారు.

పూర్తి వివరాల కోసం.. https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/06012024_UPdriver_English.pdf 
దరఖాస్తు ఫీజు : రూ.100/- (SC, ST, PH, TGలకు లేదు) 
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : ఫిబ్ర‌వ‌రి 16, 2024.

Recent

- Advertisment -spot_img