Homeవిద్య & ఉద్యోగంహైదరాబాద్‌ SPMCILలో ఉద్యోగాలు

హైదరాబాద్‌ SPMCILలో ఉద్యోగాలు

jobs in SPMCIL : హైదరాబాద్‌ SPMCILలో ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ భారత ప్రభుత్వ సంస్థ భర్తీ చేస్తున్న పోస్టులు హైదరాబాద్ నగరంలోనివే కావడం గమనార్హం.

మొత్తం 15 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

సూపర్ వైజర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 27, 2021. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు:

సూపర్‌వైజర్-4 పోస్టులు:

విద్యార్హత: కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: రూ.27,600 బేసిక్ వేతనంతో మొత్తం రూ.95,910

ల్యాబరేటరీ అసిస్టెంట్: 8 పోస్టులు,

విద్యార్హత: కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్‌సీ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.

జీతం: రూ.21,540 బేసిక్ వేతనంతో మొత్తం రూ.77,160

ఎంగ్రేవర్: 3 పోస్టులు

విద్యార్హత: స్కల్ప్‌చర్, మెటల్ వర్క్స్‌లో బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: రూ.23,910 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,570

గుర్తుంచుకోవాల్సిన వివరాలు: దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 29 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 27

ఆన్‌లైన్ టెస్ట్- 2022 జనవరి లేదా ఫిబ్రవరి ట్రేడ్ టెస్ట్- 2022 మార్చి లేదా ఏప్రిల్

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్.

అభ్యర్థులు http://igmhyderabad.spmcil.com అధికారిక వెబ్ సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

మ‌రిన్ని ఉద్యోగాల వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Recent

- Advertisment -spot_img