కోల్‌కతాలోని R.G. Kar మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. రేపు ఉదయం 10 గంటల లోపు కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలు సీబీఐకి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.