Homeజిల్లా వార్తలుదీపాదాస్ మున్షీని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

దీపాదాస్ మున్షీని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మునిసి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపాదాస్ మున్షీ ని బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని దీపాదాస్ మున్షీ ఎమ్మెల్యే కు సూచించారు.

Recent

- Advertisment -spot_img