ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ (Jukkal) నియోజకవర్గం మద్నూర్ మండలంలోని సోనాల రోడ్డుపై బుధవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో లక్ష్మణ్ దేశాయ్ (39) మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గోజేగావ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంక్రాంతి కనుమ పర్వదిన సందర్భంగా ఈ ఘటన మండల కేంద్ర ప్రజల్లో ఆందోళనకు గురి చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు.