Homeహైదరాబాద్latest NewsViral: ఏపీ ఫలితాలపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే?

Viral: ఏపీ ఫలితాలపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే?

ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నేడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ఫలితాలపై స్పందించాడు. ఎన్టీఆర్ తన ట్విట్టర్లో.. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img