త్వరలోనే దేశ వ్యాప్తంగా స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నేపద్యంలో చిన్నారులు, విద్యార్థులు కరోనా బారిన పడకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వారి దరిచేరకుండా అన్ని రకాల శాఖలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ చిన్నారులకు, విద్యార్థులకు అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేలా మార్గనిర్ధేశకాలు విడుదల చేసింది. దీని ప్రకారం విద్యాసంస్థలకు కనీసం 50 మీటర్ల దూరం వరకు ఎటువంటి జంక్‌ఫుడ్ అందుబాటులో ఉంచడానికి వీలు లేదు. అలాగే విద్యార్థులు ఉండే హాస్టళ్లు, క్యాంటీన్ల వంటి చోట్ల హానికరంగా ఉండే కొవ్వు, అధిక ఉప్పు, అధిక చెక్కర ఉండే ఆహార పదార్థాలను నిషేదించారు. అటువంటి వస్తువులను విద్యార్థులకు అందజేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.