దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మరలా పసిడి పరుగులు పెడుతున్నాయి. దేశంలో బంగారం ధరలు వారం రోజులపాటు తగ్గిన తర్వాత మళ్లీ గత మూడు రోజులుగా భారీగా పెరిగాయి, రికార్డు స్థాయికి చేరాయి. మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగి రికార్డు సృష్టించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వరుసగా రూ. 710, రూ. 2940, రూ. 2020 పెరిగింది. మూడు రోజుల్లో రూ. 5670 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వరుసగా రూ. 650, రూ. 2700, రూ. 1850 పెరిగింది. మూడు రోజుల్లో రూ. 5200 పెరిగింది.