తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనుషులకు ఆధార్ కార్డ్ ఉన్నట్టే రాష్ట్రంలోని భూములకు భూధార్ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. రెవెన్యూ చట్టంలో తొలిసారిగా ‘భూధార్ కార్డు’ రాబోతోంది. శాసనసభలో ఈ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇది వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూములకు ఇవ్వబడుతుంది. ఈ చట్టం అమల్లోకి రాగానే రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కమతానికి (భూమికి) భూధార్ నంబర్ కేటాయిస్తారు.స్వాధీనంలో ఉన్న భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు…ఈ మూడు ఉన్నప్పుడు ఏ రైతుకైనా పూర్తి భూమి హక్కు ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసే భూధార్ కార్డు కూడా కీలకం కానుంది.