అల్లం టీ… అధిక బరువున్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో అల్లం కచ్చా పచ్చాగా దంచి వేయాలి. దాన్ని ఒక కప్పు వచ్చేవరకూ మరిగించాలి. నీటిని వడకట్టి అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలు. అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలోని జింజెరాల్ అధిక కొవ్వులను వేగంగా కరిగించి, జీర్ణక్రియను మెరుగుప రుస్తుంది. బరువుని కూడా తగ్గిస్తుంది అవకాశాలు ఉంటాయి. అశ్వగంధ టీ… ఈ తేనీరు తాగితే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అదనపు కొవ్వును తగ్గిస్తాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి.దాల్చిన చెక్క టీ… శరీరంలో ఉండే చెడుకొవ్వులను కరిగించడానికి, జీవక్రియలను మెరుగుపరచడానికీ టీ సాయపడుతుంది. గ్లాసు వేడి నీళ్లల్లో చెంచా దాల్చిన చెక్కపొడి వేసి, కాస్త తేనె, నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే సరి. పొట్ట చుట్టూ ఉండే అదనపు కొవ్వు కరిగి నడుము నాజూగ్గా మారుతుంది. పసుపు, పుదీనా టీ… ఒకటిన్నర కప్పుల నీళ్లల్లో చిటికెడు పసుపు, కొన్ని పుదీనా ఆకులు వేసి చిన్న మంట మీద మరిగించాలి. దానిలో తీపి కోసం తేనె చేర్చుకుంటే మేలే. ఈ టీని రోజూ తాగడం వల్ల పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తాయి.