Homeహైదరాబాద్latest Newsన్యాయాన్ని గెలిపించాలి.. అణగారిన వర్గాలకు అండగా ఉండాలి: తొగరు రాజు

న్యాయాన్ని గెలిపించాలి.. అణగారిన వర్గాలకు అండగా ఉండాలి: తొగరు రాజు

ఇదేనిజం, లక్షెట్టిపేట: న్యాయాన్ని గెలిపిస్తూ, అణగారిన వర్గాలకు అండగా ఉండాలని, పేదలకు న్యాయం జరిగేలా చూడాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు రాజు సూచించారు. సోమవారం మండలంలోని బలరావు పేటకు చెందిన వేల్పుల సత్యం ఏజీపీగా ఎన్నికైన సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురునానక్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రోజు కూలీ పని చేసుకునే నీరుపేద కుటుంబంలో పుట్టి, తన తల్లి (వేల్పుల భూమవ్వ) ప్రోద్బలంతో కష్టపడి చదివి మారుమూల గ్రామం బలరావ్ పేట నుండి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ బీ పూర్తి చేసుకున్నాడన్నారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొన్నాడన్నారు. లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఏజీపీగా ఎన్నికవడం చాలా గొప్ప విషయమన్నారు. అనంతరం మాజీ జడ్పీటీసీ ముత్తె సత్తన్న ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు అవునూరి లచ్చన్న, మండల ప్రధాన కార్యదర్శి బైరం రవి, మాజీ మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య, అసాది పురుషోత్తం, గుత్తికొండ శ్రీధర్, గరిసే రవీందర్, గోల్కొండ సత్తయ్య, మండల ఉపాధ్యక్షులు చొప్పదండి రమేష్, బైరం లింగన్న, అలుగునూరి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, ఉపాధ్యక్షులు కల్లేపల్లి విక్రమ్, చుంచు రమేష్, కుడెల్లి రాజయ్య, మామిడి సందీప్, దర్శనాల నవీన్, చాతరాజు రాజేష్, లింగంపల్లి సుధాకర్, వేల్పుల సాగర్, అయిల్ల సోను, బోనగిరి దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img