Homeహైదరాబాద్latest NewsJyoti Malhotra : పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా.. యూట్యూబర్ ముసుగులో ఇంత ద్రోహమా..?

Jyoti Malhotra : పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా.. యూట్యూబర్ ముసుగులో ఇంత ద్రోహమా..?

Jyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కోసం ఇండియా సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలతో మే 17న అరెస్టు అయింది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్‌తో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించిన జ్యోతి.. భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు అందించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. జ్యోతి 2023లో ట్రావెల్ వీసాపై రెండుసార్లు పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంలో ఆమె పాకిస్థాన్ హైకమిషన్ అధికారి ఎహ్సాన్-ఉర్-రహీమ్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. జ్యోతి తన యూట్యూబ్ వీడియోలలో సైనిక స్థావరాల సమీపంలోని ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా షూట్ చేసింది. ఈ వీడియోలలోని స్థలాలు, వివరాలు సైనిక స్థానాలను సూచించేలా ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఆమె స్థానిక వ్యక్తులను ఆర్థికంగా ప్రలోభపెట్టి ఫోటోలు, వీడియోలు సేకరించి, వాటిని కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసింది. జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపింది. ఆమె ‘జట్ రంధావా’ అనే మారుపేరుతో శాకిర్ అలియాస్ రాణా షహబాజ్ అనే పాకిస్థాన్ గూఢచారితో నిరంతరం సంబంధాలు నిర్వహించింది.

భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జ్యోతి ఫోన్ సంభాషణలు, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను గుర్తించాయి. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లలో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి. హరియాణా, పంజాబ్‌లలో ఈ గూఢచార నెట్‌వర్క్‌లో సంబంధం ఉన్న గుజాలా, బాను నస్రీనా, యామీన్ మహ్మద్, అర్మాన్, దవిందర్ సింగ్ ధిల్లాన్‌తో సహా మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 సెక్షన్లు 3, 4, 5 కింద కేసులు నమోదు చేశారు.

దాదాపు రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రా రచ్చ సృష్టించింది. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్ ముసుగులో దేశ రహస్యాలను శత్రుదేశానికి అందించిన తీరు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. అలాగే యూట్యూబర్ ముసుగులో దేశానికీ ద్రోహం చేసిన జ్యోతి మల్హోత్రాను ఉరి తీస్తే నే బెటర్ అని ప్రజలు అంటున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటన భవిష్యత్తులో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిఘాను అవసరమని సూచిస్తోంది.

Recent

- Advertisment -spot_img