KA PAUL:ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్ వద్ద హల్ చల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)ను కలిసేందుకు వచ్చానన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అఖిలేష్ యాదవ్ కు అపాయింట్‌మెంట్ ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 2న నిర్వహించ బోయే ప్రపంచ శాంతి మహా సభలో పాల్గొనేందుకు ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చానని పాల్ అన్నారు. దాని వల్ల తెలంగాణలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వచ్చానని కేఏ పాల్ తెలిపారు. అయినా పోలీసులు అనుమతించలేదు. తెలంగాణ అప్పులు ఎలా తీర్చాలో సీఎం తో చెప్పేందుకు ప్రగతి భవన్ కు వచ్చినట్లు పాల్ తెలిపారు