వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల సమయంలో ప్రస్తావించవద్దని కడప హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు పవన్, లోకేశ్, చంద్రబాబు, పురందేశ్వరి, షర్మిల, సునిత కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు విపక్షాలకు చెంపపెట్టని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం జగన్ ను ఉద్దేశించి పదేపదే విపక్ష నాయకులు వైఎస్ వివేకా హత్య గురించి బహిరంగ సభల్లో మాట్లాడుతున్న విషయం తెలిసిందే.